హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూపాలపల్లి జిల్లాలో డీఎస్పీ శిక్షణ

BHPL: జిల్లా పోలీస్ శాఖలో ప్రొబేషనరీ డీఎస్పీ సంధన నిఖిల్ కుమార్‌కు శిక్షణ ప్రారంభించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. డీజీపీ CV ఆనంద్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి జిల్లా స్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ కొనసాగనుంది. పోలీస్ విధులు, శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, స్టేషన్ల నిర్వహణ, కేసుల దర్యాప్తుపై ఆయనకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించనున్నారు.