హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లెవాడ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

KMM: పల్లెవాడ గ్రామంలో జరిగిన చోరీ కేసును వేంసూరు పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలి ఇంట్లో బీరువా లాకర్‌ను పగులగొట్టిన ఓ గుర్తుతెలియని దుండగుడు, 82 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన వేంసూరు పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు. సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు .