హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ కష్టాలకు రైలు జర్నీతో చెక్

భాగ్యనగర వాసులను వేధిస్తున్న ట్రాఫిక్ రద్దీకి ఎక్స్‌ప్రెస్ రైళ్లు చక్కటి పరిష్కారంగా మారాయి. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి మధ్య సుమారు 23 కిలోమీటర్ల దూరాన్ని కొన్ని రైళ్లు కేవలం 30 నిమిషాల్లోనే చేరుకుంటున్నాయి. రూ.50 నుంచే టికెట్ ధర అందుబాటులో ఉండటంతో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఈ ప్రయాణం ఎంతో సమయాన్ని ఆదా చేస్తోంది.