హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ కమిటీల జాబితా అందజేత

WGL: హైదరాబాద్ గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పాల్గొన్నారు. ఏఐసీసీ తెలంగాణ నూతన ఇన్‌ఛార్జ్ బి.ఎం. సందీప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని 11 మండలాలు, 2 పట్టణాలు, 30 డివిజన్ల అధ్యక్షుల నియామకాలతో పాటు పూర్తిస్థాయి కమిటీల వివరాలను ఆయనకు అందజేశారు.