హైదరాబాద్: 28°C
తెలంగాణ

AISA రాష్ట్ర కార్యదర్శిగా జమ్మి అశోక్ ఎన్నిక

ఖమ్మం జిల్లాకు చెందిన జమ్మి అశోక్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISA) రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హన్మకొండలో నిర్వహించిన రాష్ట్ర మహాసభల్లో ఆయన ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు అశోక్‌కు అభినందనలు తెలిపారు. విద్యార్థుల హక్కుల సాధన, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మరింత బాధ్యతతో పనిచేయాలని ఆకాంక్షించారు.