హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వనదుర్గాభవాని ఆలయంలో కార్తీక పౌర్ణమి నక్షత్ర హారతి

MDK: శ్రీ వనదుర్గాభవాని ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి, సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల నడుమ అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. పర్వదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వనదుర్గమ్మను దర్శించుకున్నారు.