MLG: కార్తిక పౌర్ణమి సందర్భంగా ఏటూరునాగారం, రామన్నగూడెం శివాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తిశ్రద్ధలతో కార్తిక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. 365 వత్తులు, లక్ష వత్తులతో దీపారాధనలు నిర్వహించి స్వామివారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
కార్తిక పౌర్ణమి.. ఆలయాల్లో పోటెత్తిన భక్తులు


