హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటేలో చిన్నారి అద్భుత ప్రతిభ

PDPL: చిన్న వయసులోనే కరాటేలో గోదావరిఖనికి చెందిన అయాన్ష్ నిన్న అద్భుత ప్రతిభ కనబరిచాడు. జగిత్యాలలో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో కటా, స్పారింగ్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించాడు. తిలక్‌నగర్‌కు చెందిన శ్వేత, కిరణ్ దంపతుల కుమారుడైన అయాన్ష్ కోచ్ చందు పసునూటి వద్ద శిక్షణ పొందుతూ విజయాలు సాధిస్తున్నాడు.