హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SRCL: రుద్రంగిమండల కేంద్రంలోని అహ్లాద పర్వతంపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.