హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్కూటీని ఢీకొన్న అంబులెన్స్..ఇద్దరికి గాయాలు

SKLM: ఆమదాలవలస నయారా పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం సోమవారం చోటుచేసుకుంది. అంబులెన్స్ స్కూటీని ఢీకొనడంతో స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అమ్మాయి, అబ్బాయి వాకలవలస గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.