హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేమనపల్లి మండల ప్రజావాణిలో '0' ఫిర్యాదులు

MNCL: వేమనపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన 14 మంది అధికారులు ప్రజావాణికి హాజరైనట్లు ఎంపీడీఓ కుమారస్వామి తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు, సమస్యలపై వినతులు అందలేదన్నారు. దీంతో మొత్తం సున్నా వినతులు నమోదయ్యాయన్నారు.