హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి'

RR: జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్బీనగర్ చౌరస్తాలో వర్కింగ్ జర్నలిస్టుల JAC ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, అనధికారిక PRO హరికృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మునగనూరు సర్వే నంబర్ 90లో ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అర్హులైన జర్నలిస్టులకు జరిగిన అన్యాయంపై విచారణ జరపాలని కోరింది.