RR: ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన వుషు ఛాంపియన్‌షిప్‌లో కొత్తూరుకు చెందిన విద్యార్థి ఎ. గౌతమ్ సత్తా చాటాడు. సబ్ జూనియర్ విభాగంలోని ‘ట్రెడిషనల్ తౌలు’ పోటీలో బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా గౌతమ్‌ను పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్ ముదిరాజ్, ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
వుషు ఛాంపియన్‌షిప్‌లో కొత్తూరు విద్యార్థికి గోల్డ్


