హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన ఇంఛార్జ్ కలెక్టర్

WG: భీమవరం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఇంఛార్జ్ కలెక్టర్ కల్పశ్రీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను తనిఖీ చేశారు. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, పటిష్ఠ భద్రత నడుమ నిర్వహించాలని RDO ప్రవీణ్ కుమార్ రెడ్డి, కమిషనర్ రామచంద్ర రెడ్డిలకు సూచించారు.