హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూవివాద హత్య..లొంగిపోయిన నిందితులు

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లక్కిడాం గ్రామంలో భూ వివాదం హత్యకు దారితీసింది. పెదరాయబంధ పొలం వద్ద వరి కోత విషయంలో ఈ నెల 20న జరిగిన ఘర్షణలో కిలపర్తి రామకృష్ణ, గౌరీదేవి దాడి చేయడంతో గొల్లు సత్తిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసులో నిందితులిద్దరూ రామకృష్ణ సోదరుడు మహేశ్‌తో కలిసి సోమవారం విజయనగరం రూరల్ సీఐ ఎదుట లొంగిపోయి నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.