హైదరాబాద్: 28°C
క్రీడలు

శుభ్‌మన్ గిల్‌కు రహానే క్లాస్..!

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీరుపై మాజీ క్రికెటర్ అజింక్య రహానే అసహనం వ్యక్తం చేశాడు. భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆకాశ్ దీప్ రనౌట్ మిస్ చేశాడు. దీంతో గిల్ అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన రహానే.. అలాంటి సమయంలో కెప్టెన్‌గా గిల్ ప్లేయర్లకు మద్దతుగా నిలవాలని సూచించాడు. అంతేకానీ, ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని పేర్కొన్నాడు.