హైదరాబాద్: 28°C
క్రీడలు

మళ్లీ భారత్-పాక్ సిరీస్‌లు జరగాలి: సిద్ధూ

భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు మళ్లీ ప్రారంభం కావాలని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యానించారు. క్రీడలను రాజకీయాలకు దూరంగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, రెండు దేశాల మధ్య సిరీస్‌లు నిర్వహించాలా? వద్దా? అనేది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, భారత్ చివరిసారిగా 2012లో PAKతో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది.