హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం నగరపాలక సంస్థ Dy. మేయర్ ప్రమాణ స్వీకారం

అనంతపురం నగరపాలక సంస్థ నూతన డిప్యూటీ మేయర్‌గా 8వ డివిజన్ కార్పొరేటర్ తొండపునాటి స్వాతి ప్రమాణ స్వీకారం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె అధికారికంగా డిప్యూటీ మేయర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో డిప్యూటీ మేయర్ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.