హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుకొండ ఛైర్మన్‌గా త్రివేంద్ర మూర్తి ప్రమాణ స్వీకారం

SS: పెనుకొండ మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి ఆనందకుమార్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మంత్రి సవిత ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ప్రమాణం చేశారు. అనంతరం ఛైర్మన్‌గా త్రివేంద్ర మూర్తి, వైస్ ఛైర్మన్‌గా షౌకత్, 23 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని మంత్రి సూచించారు.