హైదరాబాద్: 28°C
వార్తలు

కాలడి విద్యార్థులకు హైకోర్టులో భారీ ఊరట

కేరళం కాలడి శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయ విద్యార్థులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. వర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులు ప్రదర్శించిన ఒక నాటకం వల్ల వివాదం చెలరేగడంతో పలువురిని క్రమశిక్షణా చర్యలు కింద వీసీ సస్పెండ్ చేశారు. దీనిని సవాలు చేస్తూ ఆ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. క్రమశిక్షణ చర్యలతో పాటు విచారణ కమిటీ సమర్పించిన నివేదికను రద్దు చేసింది.