TG: మంత్రాలు, పూజల పేరిట డబ్బులు రెట్టింపు చేస్తామని మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్, కామారెడ్డి ప్రాంతాల్లో మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.3.74 లక్షల నగదు, 3 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చోడ పీఎస్లో కేసు నమోదు చేశారు.
వార్తలు
మంత్రాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్


