దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీగా నష్టపోతున్నాయి. మధ్యాహ్నం 12.20 గంటలకు 950 పాయింట్లకు పైగా పడిన సెన్సెక్స్, ఆ తర్వాత 989.81 పాయింట్లు(1.18%) నష్టపోయి 82,929.90 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 సైతం 295.25 పాయింట్లు(1.14%) క్షీణించి 25,505.35 స్థాయికి పడిపోయింది. ఇటీవలి వరుస పరిణామాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం సూచీల నష్టానికి ఓ కారణంగా తెలుస్తోంది.
వ్యాపారం
భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్లు


