దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వారం తొలి రోజు ప్రారంభ ట్రేడింగ్‌లోనే సూచీలు రెడ్ జోన్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 536.41 పాయింట్లు(0.64%) క్షీణించి 83,383.30 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 50 సూచీ 179.55 పాయింట్లు(0.70%) నష్టపోయి 25,621.05 స్థాయి వద్ద కదలాడుతోంది. రెండు ప్రధాన సూచీలు అర శాతానికి పైగా పడిపోవడంతో ట్రేడింగ్ బలహీనంగా సాగుతోంది.
వ్యాపారం
నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు


