హైదరాబాద్: 28°C
వార్తలు

16 కోట్ల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చాం: నిర్మలమ్మ

స్వచ్ఛ భారత్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణంతో ఏటా 60 వేల నుంచి 70 వేల శిశు మరణాలు నివారించగలిగినట్లు కేంద్రమంత్రి నిర్మలమ్మ తెలిపారు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ నల్లా కలెక్షన్లను 16 కోట్ల ఇళ్లకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో రూపాయి పంపితే లబ్దిదారుల ఖాతాల్లో 15 పైసలే చేరేవని.. ప్రస్తుతం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా DBT ద్వారా నేరుగా రూపాయి చేరుతుందని వెల్లడించారు.