గత పదేళ్లలో మోదీ నాయకత్వంలో భారత్ పేదరిక నిర్మూలనలో చారిత్రాత్మక విజయం సాధించిందని కేంద్రమంత్రి నిర్మలమ్మ వెల్లడించారు. 2011 నుంచి 2023 మధ్య కాలంలో దేశంలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన ఆరు దశాబ్దాల పాటు పేదరిక నిర్మూలన ఒక నెరవేరని కలగానే మిగిలిపోయిందని తెలిపారు. గత ప్రభుత్వాలు కేవలం తాత్కాలిక ఉపశమనాలపైనే దృష్టి సారించాయని మండిపడ్డారు.
వార్తలు
50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు: నిర్మలమ్మ


