హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పచ్చి బఠానీల వల్ల కలిగే ప్రయోజనాలు

పచ్చి బఠానీలలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను క్రమబద్ధీకరించి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగి, అతిగా తినడాన్ని తగ్గిస్తాయి. రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంచుతాయి. రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను రక్షిస్తాయి. విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతాయి.