హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధిరలో మట్టి లారీల బీభత్సం

KMM: మధిర పట్టణంలో మట్టి లారీల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయ. అధిక లోడుతో వెళ్తున్న లారీల నుంచి మట్టి రోడ్డుపై పడటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ ఉదయం స్వర్ణభార్ సమీపంలో మట్టి పడటంతో ప్రమాదం తప్పింది. లారీని ఆపాలని స్థానికులు కేకలు వేసినా డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. అధికారులు స్పందించి మట్టి లారీలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.