హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌కు ఆరు విజయాలు తప్పనిసరి!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టీమిండియా మిగిలిన ఆరు టెస్టుల్లోనూ గెలవాల్సిన పరిస్థితి ఉంది. న్యూజిలాండ్‌తో ఒకటి, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. అయితే వెల్లింగ్టన్ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. చివరి గంటలో ఐదు వికెట్లు తీయలేకపోవడంతో డ్రాకు అంగీకరించింది.