హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పడమటికోన సర్పంచ్ స్థానం మూడోసారి ఏకగ్రీవం

అన్నమయ్య: చిన్నమండెం మండలంలో జరిగిన సర్పంచి ఎన్నికల్లో 13 స్థానాల్లోనూ టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవమయ్యారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సొంత మండలమైన ఇక్కడ పడమటికోన సర్పంచ్ స్థానం వరుసగా మూడోసారి ఏకగ్రీవం కావడం విశేషం. గతంలో ఎస్సీ మహిళకు కేటాయించగా, తాజాగా జనరల్‌కు దక్కడంతో వట్టం నాగశేషారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే చిన్నమండెం సర్పంచ్‌గా నజినిన్ ఖానం ఏకగ్రీవమయ్యారు.