హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నవరం ఆలయానికి పోటెత్తిన భక్తులు

KKD: అన్నవరం ఆలయానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రతమండపాలు, క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. 70 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు 6,750 జరిగాయి. ఈ మేరకు అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 82లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.