హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బలపం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి కోరాబు ఎస్తేరమ్మ

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీలో ఎన్నికల సందడి నెలకొంది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థి ఎస్తేరమ్మ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, డ్రైనేజీ కాలువల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, నిర్వహణకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులను కోరారు.