హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కానున్న శివప్రసాద్

VSP: జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్‌ పి.వి. శివప్రసాద్‌ ఎన్నిక కానున్నారు. దక్షిణ నియోజకవర్గంలోని 37వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన ఆయన పేరును జనసేన అధిష్ఠానం ఖరారు చేసింది. కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఎన్నిక లాంఛనమే కానుంది. గతంలో పవన్‌కల్యాణ్‌ అభిమాన సంఘం నగర అధ్యక్షుడిగా, జనసేన సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.