హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తు తెలియని వ్యక్తి మృతి

అనకాపల్లి పట్టణం పిసినికాడ జాతీయ రహదారి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై రవికుమార్ తెలిపారు.