హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురుకులంలో సరుకుల అక్రమ తరలింపుపై ఆరోపణలు

PPM: పాచిపెంట మండలంలోని మినీ గురుకులం బాలికల పాఠశాలలో విద్యార్థినులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకులు అక్రమంగా తరలించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బియ్యం, పప్పులు, వంటనూనె, కోడిగుడ్లు, చికెన్ తదితర సరుకులను బయటకు తరలించినట్లు విద్యార్థినుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆరోపించాయి. ఈనెల 19న రాత్రి పాఠశాల నుంచి బియ్యం తరలించిన ఘటనపై విచారణ చేపట్టలన్నారు.