హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖకు మంత్రి లోకేష్ రాక

విశాఖ: రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నోవాటెల్ హోటల్‌లో జరిగే ‘ఏషియన్-ఇండియా మారిటైమ్ కాన్క్లేవ్’లో పాల్గొంటారు. సముద్ర వాణిజ్య సంబంధాల బలోపేతం, ప్రాంతీయ సహకారం, రాష్ట్రంలో సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణపై ఈ అంతర్జాతీయ సదస్సులో కీలక చర్చలు జరగనున్నాయి.