హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 28న సింహాచలంలో ఆధ్యాత్మిక కార్యక్రమం

VSP: శ్రీవరాహ లక్ష్మీనారాయణ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 28న సింహాచలం దేవస్థానం సన్నిధిలో సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది మహిళలు భక్తిశ్రద్ధలతో పారాయణం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పారాయణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.