హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ అరసవల్లి ఆలయ ఆదాయ వివరాలు!

SKLM: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని నిన్న పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. రావిచెట్టు, గోశాలలో పూజలు నిర్వహించారు. ప్రసాదాలు, విరాళాలు, టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.8.99 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ తెలిపారు. ఆదివారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, దర్శనాలు ప్రశాంతంగా సాగాయని ఆయన పేర్కొన్నారు.