హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం: మాజీ ఎంపీ

E.G: ఆదివారం రాజమహేంద్రవరంలోని క్రైస్ట్ వర్షిప్ సెంటర్, దహించు అగ్ని తదితర ప్రార్థనా మందిరాలను మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ సందర్శించారు. వైసీపీ మేయర్ అభ్యర్థి దాసి వెంకటరావు, పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి క్రైస్తవ మత పెద్దలను కలుసుకుని ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామన్నారు.