హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముసునూరు లో భారీ నామినేషన్లు

ELR: ముసునూరు మండలంలో రెండవ రోజు ఆదివారం భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఎంపీడీవో ఏసుబాబు మాట్లాడుతూ.. సర్పంచిగా పోటీ చేసేందుకు 42 నామినేషన్లు, వార్డు సభ్యులుగా పోటీ చేసేవారు 188 నామినేషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు. రెండు రోజులలో మొత్తం సర్పంచిగా పోటీ చేసేవారు 47 నామినేషన్లు, వార్డు సభ్యులుగా పోటీ చేసేవారు 235 నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.