హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హసనాపురం నూతన ప్రజాప్రతినిధుల ఘన సత్కారం

అన్నమయ్య: రామాపురం మండలం హసనాపురం గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు చిన్నమండెం మండల జడ్పీటీసీ లక్ష్మీ ప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలదండలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన ఆకాంక్షించారు.