KKD: ఈ నెల 26న జరగనున్న ఎన్నికల విధుల్లో పాల్గొనే నగర ఓటర్లైన ఉద్యోగుల కోసం సోమవారం పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. స్మార్ట్ సిటీ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. సిబ్బంది ఎన్నికల విధుల ఉత్తర్వులు, ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు: కమిషనర్


