ATP: ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాల్లోని 9 మండలాల్లో మూడో దశ గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు కొనసాగుతోంది. నామినేషన్ల కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి డ్రోన్లతో నిరంతరం నిఘా ఉంచారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల కేంద్రాల వద్ద మొహరించిన పోలీసులు


