పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు వెంటనే అసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే కోల్కతాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రేఖా అనారోగ్యానికి కారణాలు ఎంటనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. కాగా, ఆమెపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
వార్తలు
బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రపై విషప్రయోగం.?


