హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌లో భాషా వైవిధ్యం అద్భుతం: పుతిన్‌

భారత ప్రాచీన నాగరికత, భాషా వైవిధ్యం అద్భుతమని రష్యా అధ్యక్షుడు పుతిన్ కొనియాడారు. 'భారత్‌లో ప్రధాన భాషను ఎంతమంది మాట్లాడతారని నేను ప్రధాని మోదీని ఇటీవల అడిగాను. దేశ జనాభా సుమారు 150 కోట్లు ఉండగా.. సుమారు 60 కోట్ల మంది మాట్లాడతారని చెప్పారు. జనాభాలో సుమారు మూడింట రెండు వంతుల మంది తమ సొంత భాషలను మాట్లాడుతుండటం గొప్ప విషయం' అని పుతిన్‌ ప్రశంసించారు