హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తురబాలగడ్డలో కూరగాయల వ్యాన్ బోల్తా

ASR: కొయ్యూరు మండలం తురబాలగడ్డ సమీపంలో కూరగాయల వ్యాన్ బోల్తా పడింది. నర్సీపట్నం నుంచి ఆదివారం సాయంత్రం ఒడిశా వైపు వెళ్తున్న కూరగాయల వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడంతో బోల్తా పడిందని స్థానికలు తెలిపారు. ఈ సమయంలో వ్యాన్లో ఇద్దరు ఉన్నారు. వారిద్దరు స్వల్ప గాయాలతో బయటపడినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది.