ఏలూరులో నూతన కార్పొరేటర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని ఎంపీ హితవు పలికారు. పదవులు ప్రజాసేవకు గొప్ప అవకాశమని, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీని కలసిన నూతన కార్పొరేటర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు


