హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో 24న కార్తీక పర్వదీపోత్సవం

TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ నిర్వహించనుంది. సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఆలయంలోని సన్నిధులు, మండపాలు, మహాద్వారం, స్వామి పుష్కరిణి వద్ద నేతి వత్తులతో దీపాలు వెలిగిస్తారు. అనంతరం విమాన ప్రదక్షిణం చేసి ఆనంద నిలయంలో స్వామివారికి హారతి సమర్పిస్తారు.