హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో కూటమి అభ్యర్థులకు ప్రచారం

బాపట్ల మున్సిపాలిటీలోని 36, 37, 39 వార్డుల్లో కూటమి అభ్యర్థుల తరఫున మంత్రి కొలుసు పార్థసారథి శనివారం ప్రచారం చేశారు. ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేశన్ నరేంద్ర వర్మరాజు, టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్ సహా అన్ని వార్డుల్లో కూటమికి ఓటేసి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.