హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి: సీఐ

KKD: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలని పెద్దాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.ఆర్.కె. శ్రీనివాసరావు కోరారు. ఆదివారం ఎస్సై పాపారావు, పోలీసులతో కలిసి మండలంలోని గుడివాడ, కాండ్రకోట, పులిమేశ్వరం, చదలాడ తదితర గ్రామాల్లో పర్యటించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, యువత విభేదాలకు దూరంగా ఉండాలన్నారు.