PLD: ఈవెంట్స్ పేరుతో నగదు తీసుకుని మోసం చేశాడంటూ రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో తోట శ్రీకాంత్ ఇంటి ఎదుట తిరుపతికి చెందిన ప్రియాంక ధర్నా చేశారు. ఏడాదిగా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని, పోలీసులు, లాయర్ కూడా న్యాయం చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన డబ్బు ఇప్పించకపోతే కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈవెంట్స్ పేరుతో మోసం.. బాధితురాలి ధర్నా


